Skip to main content

ISRO: ‘స్పేస్‌ రిఫార్మ్‌ ఇయర్‌’గా 2024–25

ఈ ఏడాదిని ‘స్పేస్‌ రిఫార్మ్‌ ఇయర్‌’గా ఇస్రో ప్రకటించింది.
30 Space Missions Planned From India In Next 14 Months Says ISRO

2023–24 ఆర్థిక ఏ­డా­దిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్‌­ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏ­ప్రిల్‌ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చే­యడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గ­­గన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్ర­యో­గా­త్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మా­నవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూ­మి­కి తీసుకువచ్చేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయో­గాలను నిర్వహించనున్నారు. 2024–25 ఆర్థిక ఏ­డా­దిని గగన్‌యాన్‌ సంవత్సరంగా ప్రకటించి 7 గగ­న్‌యాన్‌ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన విక్రమ్‌–1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన అగ్ని­బాన్‌–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయ­నున్నారు.

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 8 ప్రయో­గాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు. వీటి తరువాత పీఎస్‌ఎల్‌వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్‌ఎల్‌వీ ఎన్‌1, ఎన్‌2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధ­మ­వు­తున్నారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ నెల 17న జీ­ఎస్‌­ఎల్‌వీ ఎఫ్‌14, తరు­వాత ఎఫ్‌15, ఎఫ్‌16, ఎఫ్‌17 ప్ర­యోగాలను చేయ­డానికి సంసిద్ధ­మ­వుతున్నారు. ఎఎస్‌­ఎల్‌వీ సిరీస్‌లో డీ3, ఎస్‌1, ఎస్‌2 పేరుతో 3 ప్ర­యోగాలు, ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ద్వారా ఒక ప్ర­యోగంతో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు. 

Vyommitra: అంత‌రిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమ‌మిత్ర‌’

Published date : 10 Feb 2024 03:26PM

Photo Stories