Integrated Defence Factory: దేశంలోనే తొలి రక్షణ వ్యవస్థల కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ ఏర్పాటుకు వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య అక్టోబర్ 24న ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పందం కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెమ్ టెక్నాలజీ అధ్యక్షుడు వెంకట్‌రాజు, డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాల్గొన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని ఐటీ మంత్రి తెలిపారు.
చదవండి: ఏ రాష్ట్రంలో వరల్డ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీ
ఎక్కడ : ఎల్గోయి, జహీరాబాద్ సమీపం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్