Skills: ఏ రాష్ట్రంలో వరల్డ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటు కానుంది?
నైపుణ్యాభివృద్ధి విషయంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వరల్డ్ స్కిల్స్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని విశాఖట్నంలో దీనిని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ విషయాలను అక్టోబర్ 20న ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ తెలిపింది. రెండేళ్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ స్కిల్స్ పోటీలో పాల్గొనే వారికి ఈ అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తారు. కనీసం 20 విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు.
యుద్ధం తర్వాత...
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరుల కొరతను తీర్చేందుకు కొన్ని దేశాలు కలిపి ‘వరల్డ్ స్కిల్’ పేరుతో నైపుణ్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ 83కు పైగా ఉన్న సభ్య సంస్థల ద్వారా ప్రపంచంలోని మూడింట రెండొంతుల నైపుణ్య అవసరాలను తీరుస్తోంది. మన దేశంలో కూడా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిపి వరల్డ్ స్కిల్స్ ఇండియా పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తోంది.
చదవండి: జగనన్న తోడు పథకం తొలుత ఎప్పడు ప్రారంభమైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : నైపుణ్యాభివృద్ధి విషయంలో శిక్షణ అందించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్