Andhra Pradesh: జగనన్న తోడు పథకం తొలుత ఎప్పడు ప్రారంభమైంది?
జగనన్న తోడు పథకం కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అక్టోబర్ 20న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేశారు.
2020, నవంబర్ 25న ప్రారంభం...
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకం 2020, నవంబర్ 25న ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. సకాలంలో రుణం చెల్లించిన వారి ఖాతాలో వడ్డీని ప్రభుత్వం జమ చేస్తుంది.
చదవండి: చిక్కుళ్ల శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల పాలకుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న తోడు పథకం కింద 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీ జమ
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : 2020 నవంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్