Skip to main content

Vishnukundina dynasty: చిక్కుళ్ల శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల పాలకుడు?

Mahishamardini Sculpture

విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన మహిషాసురమర్ధిని రాతి శిల్పం నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని కట్టంగూరు రోడ్డులో పానగల్లుకు 3 కిలోమీటర్ల దూరంలో గల దండంపల్లి శివారులో ఓ చెట్టుకింద దీన్ని కనుగొన్నారు. గతంలో పొలానికి కాలువ తవ్వుతుండగా ఇది బయటపడింది. అక్కడి చెట్టుకింద ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ముందు దీన్ని ఉంచారు. దీన్ని తాజాగా పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. ఈ విగ్రహాన్ని విష్ణుకుండినుల కాలంనాటిదిగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. రాతి శిల్పం 10 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో ఉందని పేర్కొన్నారు.

విష్ణుకుండినులు

విష్ణుకుండిన వంశ స్థాపకుడు– మాధవ వర్మ. పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి స్వస్థలం ‘వినుకొండ’ అని ‘కేల్‌ హారన్‌’ అనే భాషా శాస్త్రవేత్త నిర్ణయించాడు. వీరి కులదైవం ‘శ్రీపర్వత స్వామి’ (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ‘ఇంద్రవర్మ’. ఈయన ‘ఇంద్రపాల నగరం’ నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని ‘తుమ్మల గూడెం’ అని చరిత్రకారుల అభిప్రాయం. చిక్కుళ్ల శాసనం తుమ్మల గూడెం ఉంది.

 

విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు:

1) చిక్కుళ్ల శాసనం – విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం – ఇంద్రవర్మ
3) పాలమూరు – మాధవవర్మ
4) వేల్పూరు – రెండో మాధవవర్మ
 

చ‌ద‌వండి: విష్ణుకుండినులు-వివ‌రాలు

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన మహిషాసురమర్ధిని రాతి శిల్పం గుర్తింపు
ఎప్పుడు  : అక్టోబర్‌ 12
ఎవరు    : పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి
ఎక్కడ    : దండంపల్లి, నల్లగొండ సమీపం, నల్లగొండ జిల్లా

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 13 Oct 2021 06:41PM

Photo Stories