Skip to main content

Tirupati as Knowledge Capital: నాలెడ్జ్‌ క్యాపిటల్‌గా తిరుపతి

తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్‌ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్‌ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సంతను భట్టాచార్య చెప్పారు.
Tirupati as Knowledge Capital, Professor Santanu Bhattacharya, director of ISER
Tirupati as Knowledge Capital

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్‌లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

Skill Universe Dashboard: నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పనకు ‘స్కిల్‌ యూనివర్స్‌’ డ్యాష్‌ బోర్డు

దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్‌ యాప్స్‌ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు.

AP Ranks Third in Tomato Production: టమాటా ఉత్పత్తిలో మూడో స్థానంలో ఏపీ

పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి,  అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. 

Millets Export: చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ

Published date : 15 Sep 2023 01:30PM

Photo Stories