Skip to main content

AP Ranks Third in Tomato Production: టమాటా ఉత్పత్తిలో మూడో స్థానంలో ఏపీ

దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.
AP Ranks Third in Tomato Production
AP Ranks Third in Tomato Production

రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్‌ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది.
ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.

Millets Export: చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ  

ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం.. 

ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉత్ప­త్తి గణనీయంగా తగ్గడమేనని నా­బా­ర్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్‌లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్‌లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది.

Ayushman Bharat Digital Health Cards: డిజిటల్‌ హెల్త్‌ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ

అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది.

Green Field Bio Ethanol Plant in Chodavaram: చోడవరంలో గ్రీన్‌ ఫీల్డ్‌ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

Published date : 23 Aug 2023 12:45PM

Photo Stories