Skip to main content

Ayushman Bharat Digital Health Cards: డిజిటల్‌ హెల్త్‌ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ

డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌ల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
Ayushman-Bharat-Digital-Health-Cards
Digital Health Cards

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు  43.01 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ రిజిస్టేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలోఉంది. 4.04 కోట్ల­తో మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్‌–5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

☛☛ Rural Employment Works: ‘ఉపాధి’లో ఏపీ ఫస్ట్‌

Published date : 03 Aug 2023 03:29PM

Photo Stories