Swachh Vayu Sarvekshan Award 2023: గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2023’లో అవార్డు
దేశంలో వాయు నాణ్యతను మెరుగుపరిచే ఉద్దేశంతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ) కింద నగరాలను ర్యాంకింగ్ చేయడానికి కేంద్ర పర్యావరణం, అటవీ–వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను అందజేసింది. 2023 సంవత్సరానికి గాను 3–10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు నగరం మూడో స్థానంలో నిలిచింది. 2022–23 నుండి 2025–26 ఆర్థిక సంవత్సరాలకు ఈ పథకాన్ని కేంద్ర పర్యావరణం, అటవీ–వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 కేటగిరీల్లో 9 నగరాలు అవార్డులు గెలుచుకున్నాయి.
Platinum Rating For Vijayawada Station: విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్
గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవార్డులను అందించారు. దేశవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్‌ల కోసం ఎంపిక చేసిన 131 నగరాల్లో, 10 లక్షల కంటే ఎక్కువ నివాసితులు ఉన్న కేటగిరీ 1 కింద 47 నగరాలు ఉంటే అందులో ఇండోర్ ప్రథమ స్థానంలో ఆ తర్వాతఆగ్రా, థానేలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న కేటగిరీ 2 కింద 44 నగరాలు ఉండగా అందులో మహారాష్ట్రలోని అమరావతి తొలిస్థానంలో, మొరాదాబాద్, గుంటూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
National Accreditation Board for Hospitals: విశాఖపట్నం ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు