Platinum Rating For Vijayawada Station: విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్
పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించినందుకు గాను విజయవాడ స్టేషన్‌కు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఉద్యోగులను విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ డివిజన్‌లో అవలంభిస్తున్న పర్యావరణ అనుకూల సేవలపై 2019లో గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ సాధించినట్లు తెలిపారు. తాజాగా ప్లాటినం రేటింగ్ రావటం డివిజన్‌కే గర్వకారణం అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్లాటినం రేటింగ్ సాధించిన స్టేషన్‌గా సికింద్రాబాద్ తర్వాత స్థానం విజయవాడకు వచ్చిందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, శక్తి వినియోగం, నీటి సామర్థ్యం, స్మార్ట్ అండ్ గ్రీన్ పద్ధతుల అభివృద్ధి తదితర విషయాలపై ప్లాటినం రేటింగ్ వచ్చినట్లు వివరించారు.
Amrit Bharat Station Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లకు మహర్దశ