STEMI Project in Andhra Pradesh: స్టెమీ ప్రాజెక్టుతో గుండెకు రక్ష
కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది.
YSR Kalyana Mastu, YSR Shaadi Tohfa: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు విడుదల
రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్‌లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్‌లాబ్స్‌ను సమకూర్చింది.
YSR Sampoorna Poshana: ‘సంపూర్ణ’ ఆరోగ్యం
గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు
రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు.