Minister Pushpa Srivani: రాష్ట్రంలోని ఏ జిల్లాలో గిరిజన మ్యూజియానికి శంకుస్థాపన చేశారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి అక్టోబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
చదవండి: వైఎస్సార్ ఆసరా పథకాన్ని తొలుత ఎప్పుడు ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి
ఎక్కడ : తాజంగి, చింతపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్