Dubai: బుర్జ్ ఖలీఫాపై ఏ రాష్ట్ర పండుగ వీడియోను ప్రదర్శించారు?
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో యూఏఈలోని దుబాయ్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా తెరపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరపుకునే పండుగ ‘బతుకమ్మ’ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను అక్టోబర్ 23న రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. ‘జై తెలంగాణ’, ‘జై హింద్’ నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు.
చదవండి: దేశంలోనే తొలి రక్షణ వ్యవస్థల కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బతుకమ్మ పండుగ వీడియో ప్రదర్శన
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : యూఏఈ ప్రభుత్వం
ఎక్కడ : బుర్జ్ ఖలీఫా తెరపై, దుబాయ్, యూఏఈ
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరపుకునే పండుగ ‘బతుకమ్మ’ విశిష్టతను చాటేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్