Vijaya Kishore: ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే.. కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
Rashmika Mandanna: జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక
రహాట్కర్ మహిళల న్యాయపరమైన సమస్యలపై ‘విధిలిఖిత్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈమె మహిళల సాధికారతకు చేసిన కృషికి జాతీయ న్యాయ పురస్కారంతోపాటు, జాతీయ సాహిత్య మండలి నుంచి సావిత్రిబాయి ఫులే పురస్కారాన్ని అందుకున్నారు.