Uday Kotak: కొటక్ మహీంద్రాకు ఉదయ్ కొటక్ రాజీనామా
Sakshi Education
ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెప్టెంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచ్చిందని బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్‌లో ఆయనకు 26 శాతం వాటా ఉంది.ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం.
Global Finance Central Banker Report Cards 2023: శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్
Published date : 04 Sep 2023 03:48PM