Global Finance Central Banker Report Cards 2023: శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్
Sakshi Education
అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నిలిచారు.
అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023’లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించింది. ఏ+ రేటింగ్ ముగ్గురు కేంద్ర బ్యాంక్ గవర్నర్‌లకు ఇవ్వగా, అందులో శక్తికాంత దాస్ అగ్రస్థానం పొందారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్‌లను కేటాయించారు. అద్భుతమైన పనితీరుకు ఏ, అధ్వాన పనితీరుకు ఎఫ్ రేటింగ్ ఇచ్చారు. దాస్ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్(స్విస్ సెంట్రల్ బ్యాంక్)గవర్నర్ థామస్ జె. జోర్డాన్, వియత్నాం కేంద్ర బ్యాంక్ అధిపతి ఎన్‌గుయెన్ థి హాంగ్ ఉన్నారు.
Railway Board New Chair Person: రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా
Published date : 04 Sep 2023 10:51AM