Skip to main content

WHO Director General: డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్‌?

Tedros Adhanom Ghebreyesus

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌గా టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని అక్టోబర్‌ 29న డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి అధినేత ఎన్నిక కోసం నామినేషన్ల గడువు ముగిసే నాటికి కొత్తగా ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపింది. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్‌. 2017లో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఐదేళ్ల పదవీకాలం 2022, మేలో ముగియనుంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగేందుకు టెడ్రోస్‌ పేరును ఫ్రాన్స్, జర్మనీ సిఫార్సు చేశాయి. ఆయన ఎన్నికను ఇతరులెవ్వరూ వ్యతిరేకించలేదు

ప్రపంచ ఆరోగ్య సంస్థ: ఏప్రిల్‌ 7, 1948న ఏర్పాటైంది. ఏప్రిల్‌ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సర్వేను కూడా నిర్వహిస్తుంది.
 

చ‌ద‌వండి: యాంబిషన్‌ ఇండియా సదస్సులో ప్రసగించిన నేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు    : టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ 
ఎందుకు : డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి డైరెక్టర్‌ జనరల్‌ ఎన్నిక కోసం నామినేషన్ల గడువు ముగిసే నాటికి కొత్తగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 04:29PM

Photo Stories