Suryakumar Yadav: టీ20లో సూర్యకుమార్ యాదవ్ రికార్డు
ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. కాగా సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ(4), గ్లేన్ మ్యాక్స్‌వెల్(4) సరసన సూర్య నిలిచాడు.
Khel Ratna Award: ఖేల్‌రత్న అవార్డు రేసులో సాత్విక్–చిరాగ్ జోడి
ఇక ఈ మ్యాచ్‌లో విరోచిత శతకంతో చెలరేగిన సూర్యకుమార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.
తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును మిస్టర్ 360 బ్రేక్ చేశాడు. కాగా మ్యాక్స్‌వెల్ తన నాలుగు సెంచరీల మార్క్‌ను 92 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ కూడా సూర్యనే కావడం గమనార్హం.