Ranji Trophy: "12th ఫెయిల్ సినిమా" డైరెక్టర్ కొడుకు ప్రపంచ రికార్డు.. వరుసగా నాలుగు సెంచరీలు..!
Sakshi Education
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు.
![Agni Chopra scripts record on the pitch against Sikkim Agni Chopra, son of Bollywood director Vidhu Vinod Chopra, achieves world record in first-class cricket.](/sites/default/files/images/2024/02/02/agni-chopra-1706850325.jpg)
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన తొలి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా మేఘాలయాతో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగిన చోప్రా ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాది సీజన్‌తో రంజీల్లోకి అరంగేట్రం చేసిన చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్‌లో సెంచరీ, తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. అనంతరం నాగాలాండ్, అరుణాచాల్ ప్రదేశ్‌పై సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెంచరీతో మెరిశాడు.
ఈ ఏడాది రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.
Akshdeep Singh: 20 కిలోమీటర్ల నడకలో అక్ష్‌దీప్ జాతీయ రికార్డు..
Published date : 02 Feb 2024 10:35AM