వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు అర్హత సాధించింది.
Namibia qualify for ICC Men's T20 World Cup 2024
ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి అగ్ర స్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. మంగళవారం జరిగిన పోరులో నమీబియా 58 పరుగుల తేడాతో టాంజానియాను ఓడించింది. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. 2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా ఈ టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.