U19 T20 World Cup: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత భారత్

కౌలాలంపూర్‌లో ఫిబ్రవరి 2వ తేదీ జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఛేదించింది.
తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ (3/15, 44 నాటౌట్) ప్రతిభతో భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఆల్‌రౌండ్ మెరుపులతో త్రిషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అద్వితీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కించుకుంది.
ఈ టోర్నీ మొత్తంలో భారత్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా దాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రోత్సాహకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.
ICC Awards: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్‌గా రికార్డు