Indian Space Research Organisation: ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన శాస్త్రవేత్త?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. స్పేస్ సెక్రటరీగా, స్పేష్ కమిషన్ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించనున్నారు. ఈ మేరకు జనవరి 12న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీనీయర్ శాస్త్రవేత్త అయిన సోమనాథ్.. 2022, జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టి, మూడేళ్ళపాటు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె.శివన్ పదవీకాలం జనవరి 14న ముగియనుండడంతో నూతన చైర్మన్‌గా సోమనాథ్‌ను నియమించారు. కేరళలోని ఎర్నాకుళంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఎస్.సోమనాథ్ ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో పీజీ చేశారు. 1985లో ఇస్రోలో చేరారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది.
చదవండి: భద్రతా వైఫల్యంపై ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : తివనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సోమనాథ్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె.శివన్ పదవీకాలం 2022, జనవరి 14న ముగియనుండటంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్