Supreme Court: భద్రతా వైఫల్యంపై ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై పూర్తి దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఈ కమిటీని నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ జనవరి 12న ఉత్తర్వులిచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డీజీపీ(సెక్యూరిటీ) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
తొలి మహిళ..
సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయిన జస్టిస్ ఇందూ మల్హోత్రా ఆ పదవిలో 2018 ఏప్రిల్ 27 నుంచి 2021 మార్చి 13 వరకు కొనసాగారు. అంతకుముందు 2007లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపుపొందారు. సీనియర్ న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి మహిళగా ఆమె పేరొందారు. పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె కీలకమైన తీర్పుల్లో భాగస్వామి.
చదవండి: యూరోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై పూర్తి దర్యాప్తునకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్