Skip to main content

Master of the Santoor: ప్రముఖ సంతూర్‌ విద్యాంసుడు శివకుమార్‌ శర్మ కన్నుమూత

Pandit Shiv Kumar Sharma, Master of the Santoor, Dies at 84
Pandit Shiv Kumar Sharma, Master of the Santoor, Dies at 84

జానపద వాయిద్య పరికరం సంతూర్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖ విద్వాంసుడు పండిత్‌ శివకుమార్‌ శర్మ(83) మే 10న కన్నుమూశారు. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత అయిన శర్మ 1938లో జమ్మూలో జన్మించారు. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు. జమ్మూ–కశ్మీర్‌లో ఓ జానపద వాయిద్య పరికరమైన సంతూర్‌పై భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన తొలి సంగీతకారుడుగా గుర్తింపు పొందారు. ప్రముఖ ఫ్లూట్‌ విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియాతో కలిసి ‘శివ–హరి’ స్వరకల్పన ద్వయంగా ప్రఖ్యాతి గాంచారు. 
 

Published date : 16 May 2022 07:52PM

Photo Stories