Skip to main content

Nikita Porwal: ‘మిస్‌ ఇండియా’గా నిఖిత పోర్వాల్‌

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్‌ మిస్‌ ఇండియా టైటిల్ గెలుచుకుంది.
Nikita Porwal Was Crowned Femina Miss India 2024

టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్‌ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. 

అక్టోబర్ 16వ తేదీ ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్‌ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్‌ కిరీటధారిగా నిలిచింది. 

27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్‌ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది.  

‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అని నికిత పొర్వాల్ అంటుంది. 

తండ్రి ప్రోత్సాహంతో.. 
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్‌ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్‌ పొర్వాల్‌ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్‌ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశపెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. 

‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్‌ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్‌ వాళ్లు నాకు సపోర్ట్‌ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్‌ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్‌ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్‌ వృథా పోలేదు’ అని నికిత అంటుంది. 

Rashmika Mandanna: జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక

టీవీ యాంకర్‌గా.. 
కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవీ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్‌ ఇండియా’ అయ్యింది.

Published date : 18 Oct 2024 12:41PM

Photo Stories