Skip to main content

Nandan Nilekani: ఐఐటీ–బాంబేకు రూ.400 కోట్ల విరాళం.. గొప్ప మనసు చాటుకున్న ఇన్ఫోసిస్ కో ఫౌండర్..!

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నందన్‌ నీలేకని(68) మరోసారి త‌న గొప్ప మనసుతో అందరి హృదయాలు గెలుచుకున్నారు.
Nandan Nilekani

తను చదువుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబేకు భారీ విరాళం ప్రకటించారు. ఆ సంస్థతో తన 50 సంవత్సరాల అనుబంధానికి గుర్తుగా ఐఐటీ–బాంబేకు మరో రూ.315 కోట్ల విరాళం అందజేశారు. దీంతో ఈ సంస్థకు ఆయన ఇప్పటిదాకా ఇచ్చిన విరాళం రూ.400 కోట్లకు చేరుకుంది. నందన్‌ నీలేకని 1973లో ఐఐటీ–బాంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో చేరారు.

 IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

ఈ సంస్థతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.315 కోట్ల విరాళం ఇచ్చినట్లు నీలేకని చెప్పారు. ఐఐటీ–బాంబేకు పూర్వ విద్యార్థులు ఇచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డుకెక్కింది. ఆయన గతంలో ఇదే సంస్థకు రూ.85 కోట్ల విరాళం అందజేశారు. ఐఐటీ–బాంబే 1958లో ఏర్పాటయ్యింది. దేశంలో ఇది రెండో ఐఐటీ. 

Inspirational UPSC Civils Ranker Success Story : నా అంగ‌వైకల్యం నా శ‌రీరానికే.. నా ల‌క్ష్యానికి కాదు.. ఈ క‌సితోనే సివిల్స్ కొట్టానిలా..

Published date : 21 Jun 2023 12:34PM

Photo Stories