Most Influential People: అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు.
ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ డిపార్ట్‌మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్‌లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం.
ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్‌లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్, సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు.
Wipro New CEO and MD: కొత్త సీఈవోను ప్రకటించిన విప్రో కంపెనీ.. ఆయన ఎవరంటే..