Skip to main content

Priyamvada Natarajan: టైమ్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్త.. ఈమె ఎవరో తెలుసా..?

ఈ ఏడాది టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ ఖగోళ శాస్త్రవేత్త ప్రియంవదా నటరాజన్ చోటు దక్కించుకుంది.
Priyamvada Natarajan Is on the 2024 TIME100 List

ఈమె ఒక ప్రముఖ భారతీయ-అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, గాలక్సీల ఏర్పాటు, పరిణామం గురించి ఆమె పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. 2023లో ఆమె టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుంది. 

నటరాజన్ ఆసక్తికర విషయాలు ఇవే..
 

  • భారత సంతతి అమెరికన్‌ అయిన ప్రియంవద నటరాజన్‌ యేల్‌ యూనివర్సిటీలో భారతీయ ప్రొఫెసర్‌. ఆమె అక్కడ ఖగోళ శాస్త్ర విభాగానికి అధ్యక్షురాలు, మహిళా ఫ్యాకల్టీ ఫోరమ్‌ చైర్‌పర్సన్‌ కూడా.
  • ఆమె ప్రాథమిక విద్య ఢిల్లీ పబ్లిక​ స్కకూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఫిజిక్స్ అండ్‌ మ్యాథమెటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
  • తదనంతరం నటరాజన్‌ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆ టైంలోనే ఆమె ప్రతిష్టాత్మకమైన ఐజాక్ న్యూటన్ విద్యార్థిని, ట్రినిటీ కళాశాలలో సహచరురాలు కూడా.

Wipro New CEO and MD: కొత్త సీఈవోను ప్రకటించిన విప్రో కంపెనీ.. ఆయ‌న ఎవ‌రంటే..

  • ఆమె ఎక్కువగా మాసివ్‌ బ్లాక్‌హోల్స్‌పై విస్తృతంగా పరిశోధనలు చేసింది. 2022లో లిబర్టీ సైన్స్ సెంటర్ జీనియస్‌ అవార్డుని గెలుచుకుంది. అంతేగాదు మెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్‌), అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ (ఏఏఏఎస్‌), గుగ్గెన్‌హీమ్ ఫౌండేషన్ మరియు రాడ్‌క్లిఫ్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక సంస్థల నుంచి ఫెలోషిప్‌లు అందుకుంది.
  • అలాగే 2016లో వచ్చిన 'మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్'  అనే పుస్తకాన్ని రాసింది.

Ambedkar Jayanti: అంబేద్కర్‌ సాధించిన అద్భుత విజయాలు ఇవే..

Published date : 18 Apr 2024 04:26PM

Photo Stories