Telangana: తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ పుస్తకాన్ని ఎవరు రచించారు?
మన కళలు, సాహిత్యం తెలంగాణకు పంచప్రాణాలని, మరుగున పడిన తెలంగాణ సాహిత్యం రాష్ట్ర అవతరణ తర్వాత వెలుగొందుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ లెక్చరర్ డాక్టర్ ఎం.దేవేంద్ర రాసిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’(1990–2010) పరిశోధనా గ్రంథాన్ని ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పాల్గొన్నారు.
Chief of Army Staff: దేశ 29వ సైనిక దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్?
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టి20 లీగ్‌లలో మాత్రం ఆడతానని ఏప్రిల్ 20న పొలార్డ్ తెలిపాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల కెరీర్‌లో 123 వన్డేలు ఆడాడు. 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2008లో ఆస్ట్రేలియాతో టి20 ఫార్మాట్‌కు శ్రీకారం చుట్టిన ఈ ఆల్‌రౌండర్ 101 మ్యాచ్‌ల్లో 1,569 పరుగులు చేశాడు.
2022 ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లో పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది... అంతర్జాతీయ క్రికెట్‌లో గిబ్స్, యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో విండీస్ గెలిచిన టి20 ప్రపంచకప్‌లో పొలార్డ్ సభ్యుడిగా ఉన్నాడు.
Governor: ఏ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ పుస్తకాన్ని ఎవరు రూపొందించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ ఎం.దేవేంద్ర రాసిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’(1990–2010) పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎక్కడ : హైదరాబాద్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్