Governor: ఏ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ పుస్తకాన్ని ఎవరు రూపొందించారు?
ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తానే గానీ రబ్బర్ స్టాంప్ గవర్నర్‌గా నడుచుకోనని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. తెలంగాణ సీఎం సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధుల నిర్వహణ, సేవా కార్యక్రమాలపై స్వయంగా రూపొందించిన రెండు పుస్తకాలను తమిళిసై ఏప్రిల్ 19న చెన్నైలో ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ‘ఒన్ ఎమాంగ్ అండ్ ఎమాంగస్ట్ ది పీపుల్’, పుదుచ్చేరి పాలనపై ‘ఏ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ’అనే పుస్తకాల తొలి ప్రతులను తన భర్త డాక్టర్ సౌందరరాజన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజాసంక్షేమం కోసం గవర్నర్, సీఎం కలిసి పనిచేస్తే ఎంత ప్రగతి సాధించవచ్చో చెప్పడానికి పుదుచ్చేరి ఉదాహరణైతే.. విభేదాలతో ముందుకు సాగితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో తెలియడానికి తెలంగాణ ఉదాహరణ’ అని పేర్కొన్నారు.
Chief of Army Staff: దేశ 29వ సైనిక దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ఒన్ ఎమాంగ్ అండ్ ఎమాంగస్ట్ ది పీపుల్’, ‘ఏ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ’ పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధుల నిర్వహణ, సేవా కార్యక్రమాలను గురించి వివరించేందుకు..
Pink Lady: ఏ దేశానికి చెందిన న్యూస్ రీడర్ పింక్ లేడీగా పేరొందారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్