Andhra Pradesh: రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేశారు. అక్టోబర్ 13న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ మిశ్రా చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి.
కొత్త న్యాయమూర్తులు వీరే..
- పి.శ్రీసుధ: 1967, జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు.
- డాక్టర్ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు.
- డాక్టర్ జి.రాధారాణి: 1963, జూన్ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు.
- ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
- ఎన్.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు.
- ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ ఆవరణలోని స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు.
- పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
ఎక్కడ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్