CBDT Chairman: సీబీడీటీ చైర్మన్‌గా నియమితులైన ఐఆర్‌ఎస్ అధికారి?
ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 1న ఒక ప్రకటన విడుదల చేసింది. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఆదాయపు పన్ను) అధికారి అయిన మహాపాత్ర... ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖకు విధాన నిర్ణయాల రూపకల్పన బోర్డ్‌లో సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీసీ మోడీ పదవీ విరమణ తర్వాత 2021, మే 31వ తేదీ నుంచి సీబీడీటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇండియన్ బ్యాంక్ ఎండీగా శాంతి లాల్...
ఇండియన్ బ్యాంక్ నూతన ఎండీ, సీఈవోగా శాంతి లాల్ జైన్ సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2018 సెప్టెంబరు నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా కొనసాగుతున్నారు. 1993లో అలహాబాద్ బ్యాంక్ ద్వారా శాంతి లాల్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్‌గా నియమితులైన ఐఆర్‌ఎస్ అధికారి?
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర
ఎందుకు : భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు...