Skip to main content

Mahila Samman Scheme: మహిళా సమ్మాన్‌ డిపాజిట్‌పై టీడీఎస్‌ లేదు

కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్‌లో మహిళా సమ్మాన్‌ పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది.
Mahila Samman Scheme

గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. అదే సమయంలో రాబడిపై టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది.
సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్‌ సర్టిఫికెట్‌లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40 వేలు మించకపోతే టీడీఎస్‌ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్‌ ఇండియా పార్ట్‌నర్‌ నీరజ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్‌ వర్తించదన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

Published date : 18 May 2023 03:58PM

Photo Stories