Gandhi Peace Prize: గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి
Sakshi Education
ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.
UN India's New ambassador: ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా బాగ్చీ
1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ సభాపతి, లోక్‌సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Mahatma Gandhi statue in Johannesburg: జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహావిష్కరణ
Published date : 24 Oct 2023 01:14PM