Skip to main content

Father of India Green Revolution: ఆకలి లేని సమాజమే ఆయన కల

దేశంలో హరిత విప్లవానికి బాటలు వేసిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌, గోధుమ, వరి వంగడాల అభివృద్ధితో వ్యవసాయ రంగానికి ఎనలేని మేలు, సుస్థిర ఆహార భద్రతలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు  
Agricultural Innovation for Sustainable Food Security,యం.యస్.స్వామినాధన్,Wheat Fields of India,Father of India's Green Revolution
యం.యస్.స్వామినాధన్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్‌ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్‌ రంగ ప్రవేశం వేశారు.

Group 2 Topics: "మొదెరా సూర్య‌దేవాల‌యం"(Surya Devalayam) సమగ్ర సమాచారం #sakshieducation

హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది.

1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్‌ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.

Einstein Visa: What is Einstein Visa | Mangesh Ghogre Gets USA Einstein Visa #sakshieducation

నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్‌ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్‌ బోర్లాగ్‌తోనూ స్వామినాథన్‌ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు.  

సివిల్‌ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు..  
మాన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథ్‌ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్‌ ఎం.కె.సాంబశివన్‌ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్‌ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్‌ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్‌ కాలేజీ నుంచి అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు.

Latest Green Card and H1B Updates 2023 | Immigration Talk show with Attorney #sakshieducation

యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరారు.  స్వామినాథన్‌ తొలుత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు.  

కరువు పరిస్థితులు చూసి..  
వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్‌లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్‌ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్‌ పేర్కొన్నారు.  

Current Affairs: G20 Summit 2023 - భారత మండపం విశేషాలు | నటరాజ విగ్రహ విశేషాలు #sakshieducation

కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు  
స్వామినాథన్‌ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫార్మర్స్‌’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు.

 ఎన్నో పదవులు  
కొంతకాలం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్‌ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్‌ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్‌ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు.  
► 1981 నుంచి 1985 దాకా ఫుడ్‌ అండ్‌ అగ్రిక       ల్చరల్‌ ఆర్గనైజేషన్‌ కౌన్సిల్‌ స్వతంత్ర చైర్మన్‌  
► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అధ్యక్షుడు  
► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని       ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌        డైరెక్టర్‌ జనరల్‌   
► 1989 నుంచి 1996 దాకా వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(ఇండియా) అధ్యక్షుడు  
► ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌      (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌  

Padma Awards 2023: మృదు మధురమైన కంఠస్వరానికి.. "పద్మ భూషణ్‌" #sakshieducation

వరించిన అవార్డులు  
► 1967లో పద్మశ్రీ  
► 1971లో రామన్‌ మెగసెసే  
► 1972లో పద్మభూషణ్‌  
► 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌  
► 1989లో పద్మవిభూషణ్‌    
► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు   

G20 Summit 2023-Biofuel Alliance: అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి..ప్రపంచ లీడర్ గా భారత్ #sakshieducation

నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే
హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్‌ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Published date : 30 Sep 2023 09:39AM

Photo Stories