First woman medical officer in Siachen: సియాచిన్‌లో తొలి మహిళా ఆర్మీ అధికారిగా గీతిక కౌల్
Sakshi Education
సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా నిలిచారు.
Captain Geetika Koul Becomes First Woman Medical Officer at Siachen
పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్‌లో (సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో) విపరీతమైన చలి ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వర్తించడమనేది సాహసంతో కూడుకున్నది. అలాంటి ప్రదేశంలో పనిచేయాలంటే శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎంతో కఠోరమైన శిక్షణలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ శిక్షణను గీతిక కౌల్ విజయవంతంగా పూర్తి చేశారు.