Forbes Most Powerful Women 2023: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు
Sakshi Education
ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది.
ఈసారి ఆ జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లో..హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమ మొండల్(70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లో ఉన్నారు.
India's first woman Governer ADC: గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
Published date : 06 Dec 2023 01:38PM