Skip to main content

AP CM Jagan : సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుద‌ల‌.. ఏఏ నెల‌లో ఏఏ ప‌థ‌కాలు అమ‌లు చేస్తారంటే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సెషన్‌ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారు.
AP CM YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఈ సందర్భంగా..
కరోనా లాంటి సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.  సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారాయన. పైగా లబ్ధిదారులు ప్లాన్‌ చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ..  భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌జగన్‌ అన్నారు. మంచి బడ్జెట్‌.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రసంగం ముగించారు. 

సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇలా..

☛ 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు

☛ మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా

☛ జూన్‌లో అమ్మ ఒడి పథకం

☛ జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు. 

☛ ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం.

☛ సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత

☛ అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా 

☛ నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు

☛ డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు

☛ 2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు

☛ ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు

☛ మార్చిలో వసతి దీవెన అమలు

జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఏ జిల్లా నుంచి సీఎం ప్రారంభించారు?

Published date : 25 Mar 2022 06:20PM

Photo Stories