AP New Governor Justice S Abdul Nazeer : ఏపీ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్.. మరో 12 మంది కొత్త గవర్నర్లలను..

ఇలాగే పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తేదీన (ఆదివారం) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
Padma Awards 2023 : ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు..
ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గతంలో..

ఏపీ కొత్త గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య, ట్రిపుల్ తలాక్ కేసులలో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఆయన ఉన్నారు. ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పదవీ విరమణ చేశారు. ఆయనకు ఇప్పుడు ఏపీ గవర్నర్‌గా మోదీ సర్కార్ అవకాశం కల్పించింది. త్వరలో అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
➤ DGCA డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్
మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్‌కు త్రివిక్రమ్ పర్నాయక్, జార్ఖండ్‌కు రాధాకృష్ణన్, అస్సాంకు గులాబ్‌చంద్ కటారియా, బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్, హిమాచల్‌ప్రదేశ్‌కు శివప్రసాద్ శుక్లా, మణిపూర్‌కు అనసూయ, లడఖ్‌కు బీడీ మిశ్రా, నాగాలాండ్‌కు గణేషన్, మేఘాలయకు చౌహన్‌లను కేంద్రం నియమించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కొత్త గవర్నర్లు వీరే..
➤ ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్
➤ అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్
➤ సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
➤ ఛత్తీస్‌ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్
➤ మహారాష్ట్ర.. రమేష్
➤ మేఘాలయ.. చౌహాన్
