Skip to main content

Aaryan Shukla : 14 ఏళ్ల‌కే అవార్డు.. రికార్డు.. హ్యూమ‌న్ కాలిక్యులేట‌ర్ ఆర్య‌న్ శుక్లా మ‌రో గ‌ణ‌త‌..

భార‌త్‌లోని మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ శుక్లా కాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
Human calculator aaryan shukla achieves records and awards at 14   Aryan Shukla setting a record for fast calculations

సాక్షి ఎడ్యుకేష‌న్: భార‌త్‌లోని మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ శుక్లా కాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆర్యన్ గ‌త సంవ‌త్స‌రం 2024లో ఇటాలియన్ టీవీ సిరీస్ లో షో డీ రికార్డ్ సెట్‌లో మొదటిసారిగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో, ఆర్యన్ కేవలం 25.19 సెకన్లలో 50 ఐదు అంకెల సంఖ్యలను మానసికంగా జోడించే వేగవంతమైన సమయం కోసం రికార్డు సృష్టించాడు, దీనిని ఒక జోడింపుకు దాదాపు 0.5 సెకన్లకు అనువదించవచ్చు.

Delhi New CM: ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం.. మంత్రులు కూడా..

ఒకేరోజులో..

అయితే, తాజాగా, ఈ యువ‌కుడు ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 6 ప్రపంచ రికార్డులు కొట్టాడు. వంద 4-అంకెల సంఖ్యలను కేవలం 30.9 సెకన్లలో, రెండు వందల 4 అంకెల సంఖ్యలను 1.9 నిమిషాల్లో, యాబై 5 అంకెల సంఖ్యలను 18.71 సెకండ్లలో యాడ్ చేశాడు. వీటితో పాటు డివిజన్, మల్టిప్లికేషన్స్‌లో మరో మూడు రికార్డులు సృష్టించాడు. త‌న రికార్డుల‌తో ఏకంగా గిన్నీస్ వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనే త‌న పేరును సాధించాడు.

ఆర్య‌న్ మాటలు..

త‌న గెలుపుపై ఆర్య‌న్ మాట్లాడుతూ.. త‌న మానసిక గణనలలో చాలా విషయాలు ఒక క్షణంలో జరిగిపోతాయని, కాబట్టి త‌న‌ తల లోపల ఏమి జరుగుతుందో తాను చెప్పలేనని, ఈ క్యాలికులేష‌న్స్ అన్ని సహజంగా చేస్తాను అని వివ‌రించారు.” ఇక‌, సాధ‌న విష‌యానికొస్తే.. ప్ర‌తీ పోటీలకు త‌న‌ని తాను సిద్ధం చేసుకోవ‌డానికి ప్ర‌తీ రోజు సాధ‌న చేస్తారంట‌.

Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

ఇలా, రోజువారీ సాధన ఒక ముఖ్యమైన అంశం అని అందుకే, తాను రోజూ 5 లేదా 6 గంటలు ఖ‌చ్చితంగా సాధన చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ సాధ‌న‌లో భాగంగానే ప్ర‌తీ రోజు సహజ యోగా ధ్యానం కూడా ప్రశాంతంగా ఉండ‌డంతోపాటు త‌మ దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుందని ఆర్య‌న్ వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Feb 2025 11:43AM

Photo Stories