New Governors: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పంపింది. మొత్తం ఆరుగురు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ఏడుగురిని మారుస్తూ ఫిబ్రవరి 12వ తేదీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. వివాదాస్పద మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో పాటు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె.మాథుర్ రాజీనామా చేశారు. కొత్త గవర్నర్లలో నలుగురు బీజేపీకి చెందినవారు. జస్టిస్ నజీర్ కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ 2017లో నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత జనవరిలో రిటైరయ్యారు. ఇక 80 ఏళ్ల కోశ్యారీ మహారాష్ట్ర గవర్నర్‌గా ఛత్రపతి శివాజీ, ముంబైపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్) కోశ్యారీ రాజీనామాను స్వాగతించాయి.
Satyanarayana Raju: కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓగా సత్యనారాయణ రాజు
కొత్త గవర్నర్లు
ఆంధ్రప్రదేశ్ |
జస్టిస్ ఎస్.ఎ.నజీర్ |
మహారాష్ట్ర |
రమేశ్ బైస్ |
బిహార్ |
విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ |
ఛత్తీస్గఢ్ |
విశ్వభూషణ్ హరిచందన్ |
జార్ఖండ్ |
సి.పి.రాధాకృష్ణన్ |
హిమాచల్ప్రదేశ్ |
శివప్రతాప్ శుక్లా |
అస్సాం |
గులాబ్చంద్ కటారియా |
అరుణాచల్ప్రదేశ్ |
త్రివిక్రమ్ పర్నాయక్ |
మణిపూర్ |
అనసూయ ఉయికె |
సిక్కిం |
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య |
నాగాలాండ్ |
ఎల్.ఎ.గణేశన్ |
మేఘాలయ |
ఫగు చౌహాన్ |
లద్దాఖ్ |
బి.డి.మిశ్రా |