Skip to main content

SKU Graduation Ceremony: బంగారు కొండలు వీరే.. 8 మందికి పతకాలు

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 17న‌ మొత్తం 44 మంది బంగారు పతకాలు అందజేశారు. వీరిలో 8 మందికి పతకాలను గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ స్వయంగా అందజేశారు. మిగిలిన వారికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అందజేశారు.
SKU Graduation Ceremony
బంగారు కొండలు వీరే.. 8 మందికి పతకాలు

తెలుగు విభాగంలో శ్రీ తూమటి దోనప్ప పల్నాడు గోల్డ్‌మెడల్‌ను జె.యోగేశ్వరనాయుడు, ఇంగ్లిష్‌ విభాగంలో మువ్వా వెంకటలక్ష్మి రామశర్మ గోల్డ్‌మెడల్‌ను గజేంద్రదాస్‌ నైరితాదాస్‌, అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ ఎస్‌.సుబ్బరామయ్య గోల్డ్‌మెడల్‌ను బలిజ అమృతలక్ష్మి, ఎకనామిక్స్‌ విభాగంలో వై.ఎస్‌ రాజారెడ్డి గోల్డ్‌మెడల్‌ను సన్నా ఓబయ్యగారి వెంకటేసులు, ఎంఈడీ విభాగంలో పి.మురళీధరుడు గోల్డ్‌మెడల్‌ను బి.కాత్యాయిని, సోషల్‌వర్క్‌ విభాగంలో బి.నాగభూషణం గోల్డ్‌మెడల్‌ను బోయ త్రివేణి, పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ఐదుకల్లు సదాశివన్‌ గోల్డ్‌మెడల్‌ను ఎస్‌.అన్నపూర్ణ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఎస్‌.శ్రీదేవి గోల్డ్‌మెడల్‌ను ఎ.ప్రసన్న భారతి, సోషియాలజీ విభాగంలో శ్రీ పరిటాల హరి గోల్డ్‌మెడల్‌ను పి.సమరసింహారెడ్డి, ఎంఎల్‌ఐఎస్సీ విభాగంలో ఓంకార జానకీబాయి నాగేశ్వరరావు గోల్డ్‌మెడల్‌ను, ప్రొఫెసర్‌ పి.కామయ్య గోల్డ్‌మెడల్‌ను ఎం.నాగవేణమ్మ, వై.జ్యోతి, హిస్టరీ విభాగంలో ఆర్‌.వసంత గోల్డ్‌మెడల్‌ను పి.ఇమామ్‌ హుస్సేన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో నీలం రాజశేఖరరెడ్డి గోల్‌మెడల్‌ను బి.నరేష్‌, కామర్స్‌ విభాగంలో తరిమెల జానకమ్మ గోల్డ్‌మెడల్‌ను డి.ప్రియాంక, ఎంబీఏ, ఎంబీఏ ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలలో కె.వెంకటరెడ్డి గోల్డ్‌మెడల్‌, క్యాపిటల్‌ ఐక్యూ గోల్డ్‌మెడల్‌, పి.సుబ్బారావు గోల్డ్‌మెడల్‌ను వి.లిఖిత, వి.హేమలత, మాస్టర్‌ ఆఫ్‌ లా విభాగంలో పరిటాల శ్రీరాములు గోల్డ్‌మెడల్‌ను కె.ఎస్‌ భవాని ఐశ్వర్య, కెమిస్ట్రీ విభాగంలో వైఎస్‌ జయమ్మ రాజారెడ్డి గోల్డ్‌మెడల్‌, ప్రొఫెసర్‌ ఎస్‌.బ్రహ్మాజీరావు గోల్డ్‌మెడల్‌ను పి.హిమబిందు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో మారెళ్లపూడి సూర్యనారాయణమూర్తి గోల్డ్‌మెడల్‌ను ఎం.శ్రావణి, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో డీవీఎస్‌ రాజు గోల్డ్‌మెడల్‌ను ఆర్‌.శ్రీలక్ష్మి, ఎంసీఏ విభాగంలో గోరంట్ల సిద్దమ్మ గోల్డ్‌మెడల్‌ను జి.సాయిభార్గవి, ఎంపీఈడీ విభాగంలో పీఎల్‌ఎన్‌ రెడ్డి గోల్డ్‌మెడల్‌ను యు.చిన్నమధు, అప్లైడ్‌ మేథమెటిక్స్‌, మేథమెటిక్స్‌ విభాగంలో డి.వి కృష్ణా గోల్డ్‌మెడల్‌, డీఆర్‌వీ ప్రసాద్‌రావు గోల్డ్‌మెడల్‌ను ఈడిగ భువనేశ్వరి, ఎన్‌.గౌతమి, ఫిజిక్స్‌ విభాగంలో టి.వి.రామకృష్ణారావు గోల్డ్‌మెడల్‌, ఆర్‌.రామకృష్ణారెడ్డి గోల్డ్‌మెడల్‌ను సి.జ్ఞానేంద్ర, డీజీ శ్రావణి, పాలిమర్‌ సైన్స్‌ విభాగంలో ఎ.కామేశ్వరరావు గోల్డ్‌మెడల్‌ను, ఎ.చౌడోజీరావు గోల్డ్‌మెడల్‌ను ఎన్‌.అఖిల్‌రెడ్డి, వై.సుష్మా, మైక్రో బయాలజీ విభాగంలో వి.రంగస్వామి గోల్డ్‌మెడల్‌, మహమ్మద్‌బాషా మొహిద్దీన్‌ గోల్డ్‌మెడల్‌ను షేక్‌ రేష్మాబేగం (రెండు), బయోటెక్నాలజీ విభాగంలో పరిటాల రవీంద్ర గోల్డ్‌మెడల్‌ను పి.చందన, జువాలజీ విభాగంలో వి.పర్వతేశ్వరరావు గోల్డ్‌మెడల్‌ను సాకే సంధ్యారాణి, బాటనీ విభాగంలో టి.పుల్లయ్య గోల్డ్‌మెడల్‌ను ఎ.హరిత, సెరికల్చర్‌ విభాగంలో ఫ్రొఫెసర్‌ ఎస్‌.శంకర్‌నాయక్‌ గోల్డ్‌మెడల్‌ను కె.లలిత, జియోగ్రఫీ విభాగంలో వై.మంజుల, వైవీ రమణయ్య గోల్డ్‌మెడల్‌ను ఎం.సాంబశివుడు, ఈఈఈ విభాగంలో ద్వారకామయి డి.వెంకటరాజు గోల్డ్‌మెడల్‌ను షేక్‌ షఫియా సుల్తానాతాజ్‌ అందుకున్నారు.
 

anu

 

Published date : 18 Jul 2023 05:10PM

Photo Stories