IAF: భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అధికారి?
భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదూరియా 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో చౌధరిని నియమించినట్లు భారత రక్షణ శాఖ సెప్టెంబర్ 21న వెల్లడించింది. చౌధరి ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఉన్నారు. 1982, డిసెంబర్ 29న ఎయిర్ ఫోర్స్‌లో చేరిన చౌధరి... దాదాపు 38 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. వైస్ చీఫ్‌కు ముందు ఆయన కీలకమైన లద్దాఖ్ బాధ్యతలను చూసే వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. మిగ్–21,23 ఎంఎఫ్, మిగ్–29, సుఖోయ్–30 ఎంకేఐ వంటి పలు రకాల యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. 3,800 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది.
చదవండి: త్రివిధ దళాల అధిపతులు-వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అధికారి?
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి
ఎందుకు : ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదూరియా 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...