PM Modi: వీర్‌బాల్ దివస్‌గా ఏ రోజును పాటించనున్నారు?
సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి–2022 సందర్భంగా జనవరి 9న ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బలబీర్ నౌక అప్పగింత
ఇండియన్ నేవీ కోసం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తయారు చేసిన బలబీర్ నౌక.. షిప్‌యార్డ్ నుంచి జనవరి 9న ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌కు తరలి వెళ్లింది. నేవీ కోసం సంస్థలో నాలుగు టగ్‌ల నిర్మాణం జరిగింది. ఇప్పటికే మూడు అప్పగించగా ఇది చివరి టగ్.
చదవండి: మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్ దివస్‌గా పాటించాలి
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్