Skip to main content

Supreme Court New Five Judges : సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు వీరే.. రాష్ట్రపతి ఆమోదం.. పూర్తి వివ‌రాలు ఇవే..

సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Supreme Court Latest News in Telugu
Supreme Court

అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము కూడా దీనిపై సంతకం చేయడంతో సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. కొలీజియం సిఫారసు మేరకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను త్వరలోనే నియమిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారమే తెలిపింది. ఆ మరునాడే నియామక ప్రక్రియ పూర్తి చేసింది.

➤☛ High Court Judges: 554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్‌ కేటగిరీకి చేందిన‌వారే..

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన న్యాయమూర్తులు వీరే..
1. జస్టిస్ పంకజ్ మిత్తల్, రాజస్థాన్ హైకోర్టు సీజే.
2. జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు సీజే.
3. జస్టిస్ పీవీ సంజయ్‌ కుమార్, మణిపూర్ హైకోర్టు సీజే.
4. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, పాట్నా హైకోర్టు జడ్జి.
5. జస్టిస్ మనోజ్ మిశ్రా, అలహాబాద్ హైకోర్టు జడ్జి.

➤☛ Supreme Court: ఇక నుంచి తెలుగులోనూ సుప్రీం తీర్పు ప్రతులు... ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసి చదువుకోవచ్చు..!

Published date : 04 Feb 2023 07:56PM

Photo Stories