RailTel: ఎన్ని స్టేషన్లలో రైల్‌వైర్ సాథీ కియోస్క్‌లను ప్రారంభించనున్నారు?
బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కియోస్క్‌లకు ‘రైల్‌వైర్ సాథీ కియోస్క్’గా రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నామకరణం చేసింది. కొత్త కియోస్క్‌లను సీఎస్‌సీ ఇ–గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తాయని జనవరి 6న రైల్‌టెల్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కియోస్క్‌లను తెస్తున్నట్లు రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా చెప్పారు. భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి రైల్‌టెల్‌ను ఏర్పాటుచేశాయి.
రైల్‌టెల్ తెలిపిన వివరాల ప్రకారం..
- రైల్‌వైర్ సాథీ కియోస్క్‌లను తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారు. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు ఈ కియోస్క్ సేవలను విస్తరిస్తారు.
- దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13, నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 13, వెస్టర్న్ రైల్వేలో 15, నార్తర్న్ రైల్వేలో 25, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 12, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 56 కియోస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు.
- కియోస్క్‌ల ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు, బస్సు, విమాన టిక్కెట్లను వీటి ద్వారా బుక్ చేసుకోవచ్చు.
చదవండి: రాష్ట్రంలోని స్కూల్‌కు జనరల్ రావత్ పేరు పెట్టారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 200 రైల్వే స్టేషన్లలో రైల్‌వైర్ సాథీ కియోస్క్‌ల ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించాలని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్