CDS General Bipin Rawat: రాష్ట్రంలోని స్కూల్‌కు జనరల్ రావత్ పేరు పెట్టారు?
దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో తమళనాడులోని నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం జనవరి 6న వెల్లడించింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే.
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ జనవరి 6న నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా విదేశాంగ శాఖ ఖండించింది. అరుణాచల్ ఎప్పుడూ భారత్‌లో భాగమేనని పేర్కొంది.
చదవండి: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒక సైనిక్ స్కూల్‌కు దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ పేరును పెట్టాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మెయిన్‌పురి జిల్లా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : హెలికాప్టర్ ప్రమాదంలో తమళనాడులోని నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్