Covid-19: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది?
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 5న వెల్లడించింది. మరోవైపు కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వాప్తిస్తున్నాయని పేర్కొంది.
2.69 శాతానికి ఆర్–వాల్యూ..
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69 శాతానికి చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.
చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై దర్యాప్తును ఎవరి నేతృత్వంలో నిర్వహించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్