Skip to main content

ADR Report: విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?

Shiv Sena


దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రూపొందించిన నివేదిక అక్టోబర్‌ 29న విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు(టాప్‌–5) పార్టీల్లో శివసేన, ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం(ఏఐఏడీఎంకే), ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), బిజు జనతా దళ్‌ పార్టీ(బీజేడీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్‌ఆర్‌సీపీ) ఉన్నాయి.

ఏడీఆర్‌ నివేదికలోని ముఖ్యాంశాలు...

  • తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉంది.
  • 27 ప్రాంతీయ పార్టీల్లో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించింది.
  • మూడో స్థానంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంది. 
  • ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్‌–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి.
  • విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి.

చ‌ద‌వండి: ‘పెగాసస్‌’పై విచారణకు ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2019–20 ఏడదిలో విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు    : శివసేన
ఎక్కడ    : దేశంలో...
ఎందుకు : అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రూపొందించిన నివేదిక ప్రకారం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 02:00PM

Photo Stories