Skip to main content

Agniveers: అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌!

సాయుధ బలగాల్లో నాలుగు సంవత్సరాలు విధులు నిర్వర్తించాక త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్‌లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్‌ కల్పిస్తామని రైల్వే శాఖ యోచిస్తోంది.
Agniveers

ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వేర్వేరు రైల్వే విభాగాల్లో నేరుగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నాన్‌–గెజిటెడ్‌ పోస్టుల్లో వారికి 15 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు.

ఆయా ఉద్యోగాలకు అర్హత వయసులో సడలింపు అవకాశం ఇవ్వనున్నారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పిస్తారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌)లో అగ్నివీర్‌లకు రిజర్వేషన్‌ విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నారు. నాన్‌–గెజిటెడ్‌ పోస్టుల్లో లెవల్‌ 1లో 10 శాతం , లెవల్‌ 2లో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. దివ్యాంగులు, మాజీ సైనికులు, అప్రైంటీస్‌ల రెగ్యులరైజేషన్‌ విధానాలకు అనుగుణంగా వీరి నియామకం ఉంటుంది. తొలి బ్యాచ్‌ అగ్నివీర్‌లకు ఐదేళ్ల వయసు సడలింపు, రెండో బ్యాచ్‌ వారికైతే మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తింపజేస్తారు.

Railway Jobs: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, బిలాస్‌పూర్‌లో 548 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 13 May 2023 09:27AM

Photo Stories